
ముగిసిన నవోదయ టేబుల్ టెన్నిస్ పోటీలు
● ఓవరాల్ చాంపియన్స్‌గా కృష్ణా క్లస్టర్ క్రీడాకారిణులు
ఎటపాక: జవహర్ నవోదయ విద్యాలయాల రీజనల్ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు గురువారం ముగిశాయి. జూలై 29 నుంచి 31 వరకు స్థానిక నవోదయ విద్యాలయంలో జరిగిన ఈపోటీల్లో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రా, కేరళ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది క్లస్టర్ల నుంచి 96 మంది ఈపోటీల్లో పాల్గొన్నారు. వీటిలో ప్రతిభ కనబర్చిన 30 మంది బాల,బాలికలను ఈనెల 18,19,20 తేదీల్లో అసోంలో జరగనున్న నేషనల్ గేమ్స్‌కు ఎంపిక చేశారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్థానిక డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వరరావు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఓవరాల్ చాంపియన్స్‌గా నిలిచిన కృష్ణా క్లస్టర్ ఎటపాక విద్యార్థినులను కోచ్ బాబూరావు, పీఈటీలు నిరుపమారాణి, జగన్‌లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కేటీ ప్రసాద్, పేరెంట్స్ టీచర్ కౌన్సిల్ సభ్యులు శివబాబు, భాస్కర్, ఉపాధ్యాయులు భాస్కరాచారి, గౌరీశంకర్ పాల్గొన్నారు.