
కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన
డుంబ్రిగుడ: ప్రజల ఆస్తుల్ని అమ్మి పథకాలు అమలు చేస్తారా అంటు అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మండిపడ్డారు. కించుమండ పంచాయతీ కు ఛీసుమవలస గ్రామంలో గురువారం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు గుడు’చ్చిన హామిల్లో పింఛన్ తప్ప ఏ ఒక్క హామి నెరవేర్చలేదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన గురించి ప్రతీ గడపగడప వెళ్లి వివరిస్తున్నామన్నారు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామిలైన సూపర్ సిక్స్ పథకాలు అమలు కాకపోవడంతో ప్రజలు ఎంత నష్టపోయరో, ప్రతీ గడపకు వెళ్లి క్యూఆర్‌కోడ్ స్కాన్ చేయించి చంద్రబాబు మోసాలను తెలసుకొవాలన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గెలుపె లక్ష్యంగా పరిచేయలన్నారు. గ్రామంలో పుట్టుకతో మూగ, చెవుడులైన ముగ్గురు అన్న, చెల్లిలో ఒకరికి పింఛన్ రాకపోవడంతో ఆరా తీశారు. వారికి పంచన్ వచ్చేల చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీపీ బాకా ఈశ్వరి, వైస్ ఎంపీపీ శెట్టి ఆనంద్‌రావు, కించుమండ ఎంపీటీసీ జి.విజయ, మండల పార్టీ అధ్యక్షుడు పి.పరశురామ్, ఉపాధ్యక్షుడు గణపతి, మండల కార్యదర్శి మఠం శంకర్‌రావు, పోతంగి వైస్ సర్పంచ్ శెట్టి జగ్గునాయుడు, మాజి జడ్పీటసీ ఎం శ్రీరాములు, నాయకులు చిరంజీవి, విజయదశమి, బబీత, కృష్ణ, కామరాజు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
పాడేరు : కూటమీ ప్రభుత్వ మోసాలు అన్ని ఇన్నీ కావని కూటమీ ప్రభుత్వ మోసాలు, వైఫల్యాలను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, కార్యకర్తలు గ్రామా గ్రామాల ప్రజలకు తెలియజేయాలని వైఎస్సార్‌సీపీ మండల అద్యక్షుడు సీదరి రాంబాబు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అద్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు మండలంలోని ఇరడాపల్లి పంచాయతీ కేంద్రంలో గురువారం బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటి కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు అందరు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటిను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ కమిటి అద్యక్షుడిగా ముదిలి సురేష్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పార్టీ ఉపాధ్యక్షుడు బసవన్నదొర, మండల యూత్ అద్యక్షుడు లింగమూర్తి, ఎంపీటీసీ సభ్యుడు సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.
రెండు పంచాయతీల్లో
బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ

కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన

కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన