
అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని వినతి
రంపచోడవరం:ఏజెన్సీలో అక్రమ మెటల్, గ్రానైట్ క్వారీల త్వవకాలపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను కోరారు. ఈ మేరకు గురువారం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలంకు వినతిపత్రాన్ని అందజేశారు.దీనిపై స్పందించిన పీవో రంపచోడవరం సబ్ కలెక్టర్‌ను విచారణ అధికారిగా నియమిస్తానని తెలిపినట్లు పెర్కొన్నారు. అనంతరం సంఘం నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కుంజా శ్రీను మాట్లాడుతూ ఏజెన్సీలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందని, ఖనిజ సంపద అంతా కూడా దోచుకుపోయే పరిస్దితి ఏర్పడిందన్నారు. ఏజెన్సీ చట్టాలకు విరుద్దంగా కొనసాగుతున్న మైనింగ్‌లపై ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో పీసా చట్టం నిబంధనల మేరకు సొసైటీలు ద్వారా మాత్రమే మైనింగ్ కొనసాగించాల్సి ఉందన్నారు. బినామీలు లేకుండా సొసైటీలు ద్వారా గిరిజనులే క్వారీలు చేసుకుంటే అభివృద్ది చెందవచ్చన్నారు. బాబూరావు, నూకరాజు, ప్రదీప్‌దొర, గంగాల అబ్బాయిదొర, పీఠ ప్రసాద్, చోడి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
గిరిజన చట్టాలు పటిష్టంగా అమలుచేయాలి
గంగవరం : ఏజన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు చేసేందుకు ఆదివాసీలంతా ఐక్యంగా పోరాటంలో భాగస్వామ్యం కావాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ఆదివాసీ సంక్షేమ పరిషత్ సమావేశంలో కుంజ శ్రీను మాట్లాడారు. ఏజన్సీలో ఆదివాసీ చట్టాలు 1/70 చట్టం, పీసా చట్టాలు గ్రామ స్థాయిలో పటిష్ట అమలకు పీసా గ్రామ కమిటీలు కృషి చేయాలన్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రతినిధులు బాబూరావు, నూకరాజు, ప్రదీప్‌కుమార్, ప్రసాద్, అబ్బాయిదొర, ప్రసాద్‌దొర, ఏడుకొండలరావు, చైతన్యతేజ తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ సంక్షేమ పరిషత్ డిమాండ్