
చట్టాలపై అవగాహన
ముంచంగిపుట్టు: విద్యార్థినులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని ఎస్‌ఐ జె.రామకృష్ణ అన్నారు.మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల–1లో గురువారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులు, మహిళలుపై జరుగుతున్న నేరాలు వాటి నుంచి రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.విద్యార్థినులకు ఉపయోగపడే పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థినులు, మహిళల రక్షణ కోసం పోలీసుశాఖ నిరంతరం పని చేస్తుందని, మహిళలు వారి హక్కులు, చట్టాలను వినియోగించుకోవాలని అన్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరుగుతున్నాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. హెచ్‌ఎం కోడా లక్ష్మీ, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
ఎటపాక: మహిళల రక్షణ ,చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఎటపాక ఎస్‌ఐ అప్పలరాజు అన్నారు. గురువారం డాక్టర్ పాల్‌రాజ్ ఇంజనీరింగ్ కాలేజిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సామాజిక మాద్యమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళల చట్టాలు, హక్కులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.మహిళల భద్రతకు ఏర్పాటు చేసిన శక్తి యాప్‌ను వినియోగించుకోవాలని తెలిపారు.

చట్టాలపై అవగాహన