
ఉత్సాహంగా టెన్నిస్ పోటీలు
ఎటపాక: స్థానిక నవోదయ విద్యాలయంలో టేబుల్ టెన్నిస్ రీజనల్ స్థాయి పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో సాగుతున్నాయి. మంగళవారం ప్రారంభమైన ఈ పోటీల్లో కేరళ, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల నుంచి నవోదయ విద్యార్థులు వచ్చారు. ఫీల్డ్ గేమ్స్‌లో విభాగంలో జరుగుతున్న ఈ పోటీలకు బీదర్, కడప, ఖమ్మం, కృష్ణ, వాయినాడ్, పట్నందిట్ట, షిమోగ, తుంకూర్ క్లస్టర్ల నుంచి 48 మంది బాలురు, 48మంది బాలికలు పోటీలకు వచ్చారు. వీటిలో ప్రతిభ కనబర్చిన 15 మంది బాలురు,15 మంది బాలికలను టేబుల్‌టెన్నిస్ నేషనల్ గేమ్స్‌కు ఎంపిక చేస్తారు. వీరు ఇక్కడి జవహర్ నవోదయలో 15 రోజుల పాటు శిక్షణ పొందిన తరువాత అస్సాంలోని బిస్వనాథ్‌లో వచ్చేనెల 18,19,20 తేదీల్లో జరగనున్న నేషనల్‌గేమ్స్‌లో పాల్గొంటారని విద్యాలయం పీటీ జగన్ తెలిపారు.
ఎనిమిది క్లస్టర్ల నుంచి విచ్చేసిన
క్రీడాకారులు
నేషనల్ గేమ్స్‌కు ఎంపిక కానున్న
30 మంది బాల బాలికలు
ఇక్కడే వీరికి 15 రోజులపాటు శిక్షణ