
పర్యాటకులను కాపాడిన లైఫ్‌గార్డ్స్
కొమ్మాది: ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషికొండ బీచ్‌లో స్నానం చేస్తుండగా కెరటాల ఉధృతికి కొట్టుకుపోతున్న ఇద్దరు పర్యాటకులను లైఫ్‌గార్డ్స్ రక్షించారు. బెంగళూరుకు చెందిన ఆరుగురు పర్యాటకులు బుధవారం బీచ్‌కు వచ్చారు. కాసేపు సరదాగా గడిపి, స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో వీరిలో మంజునాథ్, పాపైగౌడ అనే ఇద్దరు కొట్టుకుని పోతుండగా గమనించిన లైఫ్‌గార్డ్స్ ఎస్. నూకరాజు, ఎం. అమ్మోరు, చందు, సతీష్ అప్రమత్తమై రక్షించారు. అనంతరం వారికి మైరెన్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.