
అక్రమాలకు పాల్పడితే చర్యలు
మహారాణిపేట: నగరంలోని ఐవీఎఫ్, సరోగసీ కేంద్రాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు ఆధ్వర్యంలో నోడల్ ఆఫీసర్ డాక్టర్ బి.ఉమావతి, జిల్లా మీడియా విస్తరణాధికారి బి.నాగేశ్వరరావు ఆయా కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. ఫెర్టీ9 ఐవీఎఫ్ సెంటర్, వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్, డాక్టర్ ఆడమ్స్ ఫెర్టిలిటీ సెంటర్(పీఎంపాలెం)లను సందర్శించి రికార్డులను పరిశీలించారు. స్కానింగ్ రికార్డులను తనిఖీ చేసి, ఫారం–ఎఫ్ గురించి వారికి వివరించారు. అన్ని సరోగసీ కేంద్రాలు నియమ నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని డీఎంహెచ్‌వో కేంద్రాల నిర్వాహకులకు స్పష్టం చేశారు. ఎటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడకూడదన్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఐవీఎఫ్ కేంద్రాలు నిర్వహిస్తే, చర్యలు తప్పవని హెచ్చరించారు. సకాలంలో రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేసుకోవడం తప్పనిసరి అని సూచించారు. సరోగసీ కేంద్రాలు, ఏఆర్‌టీ బ్యాంక్ ఎల్1, ఎల్2లను క్షుణ్ణంగా పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు.
డీఎంహెచ్‌వో
జగదీశ్వరరావు
ఐవీఎఫ్, సరోగసీ కేంద్రాల్లో కొనసాగిన తనిఖీలు