
చింతూరు సీఐగా గోపాలకృష్ణ
● బాధ్యతల స్వీకరణ
చింతూరు: స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా చిత్రాడ గోపాలకృష్ణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మారేడుమిల్లి సీఐగా విధులు నిర్వహిస్తున్న ఆయన ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ సీఐగా పనిచేసిన దుర్గాప్రసాద్ పాడేరు మహిళా పోలీసుస్టేషన్‌కు బదిలీఅయ్యారు. బాధ్యతలు చేపట్టిన సీఐ గోపాలకృష్ణను చింతూరు ఎస్‌ఐ రమేష్, మోతుగూడెం ఎస్‌ఐ సాధిఖ్, డొంకరాయి ఎస్‌ఐ శివకుమార్ మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.