
ఆర్థికంగా భారం
ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువులను ఇంత వరకు పంపిణీ చేయలేదు. వరినాట్లు జోరందుకున్న సమయంలో ఎరువుల అవసరం ఎక్కువగా ఉంటుంది.వారపుసంతల్లో అధిక ధరలకు యూరియా,డీఎపీలను కొనుగోలు చేయడం భారంగా మారింది.
– నాగుల మత్స్యలింగం, గిరిజన రైతు, కుంతుర్ల,
పెదబయలు మండలం
ఎరువు వేస్తేనే
మంచి దిగుబడి
సహజ ఎరువులు అందుబాటులో ఉండటం లేదు. దీనివల్ల తప్పనిసరిగా రసాయన ఎరువులపై ఆధారపడాల్సి వస్తోంది. వీటిని పైరుకు సకాలంలో వేస్తేనే మంచి దిగుబడి సాధ్యం. లేదంటే పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి ఎదురవుతుంది. ప్రభుత్వం వెంటనే సరఫరా చేయాలి.
– వండ్లాబు దేముళ్లునాయుడు, రైతు,
గొడ్డుబూసులు, జి.మాడుగుల మండలం
సబ్సిడీపై సరఫరా చేయాలి
గిరిజన ప్రాంతాల్లో గత ప్రభుత్వాలు విత్తనాలతో పాటు ఎరువులు సబ్సీడీపై అందించేవి. ప్రస్తుత ప్రభుత్వం ఎరువులు సరఫరా చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. తమ పంటలకు కావల్సిన ఎరువులు బయట మార్కెట్‌ల్లో కొనుగోలు చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నాం.
– చిన్న మత్స్యకొండబాబు, రైతు,
గడుతూరు గ్రామం, జి.మాడుగుల మండలం

ఆర్థికంగా భారం