
కాఫీ రైతులకుమొక్కల పంపిణీ
● పాడైన వాటి స్థానంలో
నాటేందుకు చర్యలు
● ఐటీడీఏ కాఫీ విభాగం ఏడీ లకే బొంజుబాబు
చింతపల్లి: పాడేరు డివిజన్ పరిధిలోని గిరిజన రైతులకు చెందిన పాత కాఫీ తోటల్లో కొత్త మొక్కలు నాటే కార్యక్రమానికి చర్యలు తీసుకుంటున్నామని ఐటీడీఏ కాఫీ విభాగం ఏడీ లకే బొంజుబాబు తెలిపారు. మంగళవారం ఆయన మండలంలోని గాదిగొయ్యి, రామనగర్ కాలనీ, బెన్నవరం, నక్కమెట్ట, సూదిమెట్ట గ్రామాల్లో కాఫీ తోటలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గిరి రైతులు సాగుచేసే పాత కాఫీ తోటల్లో పాడైన మొక్కల స్థానాల్లో కొత్త మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. డివిజన్ పరిధిలో పదివేల ఎకరాల్లో 234 నర్సరీల ద్వారా తయారు చేసిన మొక్కలను ఎకరాకు 450 చొప్పున రైతులకు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో కూడా రైతులు తోటల్లో ఈ మొక్కలు నాటే కార్యక్రమం వేగవంతం చేసేలా దిగువస్థాయి సిబ్బందిని ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో ధర్మారాయ్, ఎఫ్‌సీలు విశ్వాస్‌బాబు, క్లస్టర్ లైజన్ వర్కర్లు చంటిబాబు, అప్పారావు పాల్గొన్నారు.