
ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఏర్పాట్లు
రంపచోడవరం: వచ్చేనెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని స్థానిక ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం కోరారు. మంగళవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో మంగళవారం ఆదివాసీ దినోత్సవం నిర్వహించేందుకు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, గిరిజనులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ దినోత్సవం అన్ని తెగల గిరిజనులతో ఘనంగా నిర్వహించేందుకు గిరిజన సంఘాలు, ప్రతినిధులతో ముందస్తు సమా వేశం ఏర్పాటు చేశామన్నారు. ఆదివాసీ దినోత్సవ నిర్వహణకు మండలానికి రూ. 10 వేల నిధులు ఏర్పాటచేశామన్నారు. రంపచోడవరంలో జరిగే ఆదివాసీ దినోత్సవానికి హాజరయ్యే గిరిజనులకు భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్టు పీవో తెలిపారు.