
150 లీటర్ల సారా స్వాధీనం
హుకుంపేట: గ్రామల్లో సారా విక్రయాలు, తయారీ చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని, సారా విక్రయాలకు గిరిజనులు దూరంగా ఉండాలని సీఐ సన్యాసినాయుడు, పాడేరు ఎకై ్సజ్ సీఐ టి.వి.వి.ఎస్.ఎన్ ఆచార్యలు తెలిపారు. మండలంలోని ఉప్ప, పోసలగరువు గ్రామాల్లో స్థానిక సీఐ ఆధ్వర్యంలో సారా విక్రయాలు, తయారీ చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు స్థానిక పోలీస్ స్టేషన్, ఎకై ్సజ్ శాఖ, రెవిన్యూ శాఖ సంయుక్తంగా సోమవారం దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో నల్లబెల్లం, సుమారు 600లీటర్ల పులుపు ధ్వంసం చేసి 150 లీటర్లు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మండలంలోని ఈ గ్రామలతో పాటు అనేక గ్రామాల్లో సారా విక్రయాలు, తయారీ చేపడుతున్నారన్నార. ఇకపై సారా తయారీ చేపడితే సహించేదిలేదన్నారు. సారాతో ఎవరైన పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్‌ఐ సూర్యనారయణ, రెవెన్యూ సిబ్బంది, పోలిస్ శాఖ, ఎకై ్సజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.