బంగారు కుటుంబాల దత్తతకు ముందుకు రావాలి | - | Sakshi
Sakshi News home page

బంగారు కుటుంబాల దత్తతకు ముందుకు రావాలి

Jul 29 2025 7:24 AM | Updated on Jul 29 2025 7:56 AM

బంగార

బంగారు కుటుంబాల దత్తతకు ముందుకు రావాలి

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పిలుపు

సాక్షి, పాడేరు: బంగారు కుటుంబాల దత్తతకు మార్గదర్శకులంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్‌ ఎ.ఎస్‌.దినేష్‌కుమార్‌ పిలుపునిచ్చారు.సోమవారం ఆయన కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు పీ–4 వినూత్న కార్యక్రమాన్ని మార్చి నెలలో ప్రారంభించారన్నారు.మార్చి 9వతేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించామని, 352 సచివాలయాల పరిధిలో 92,683 బంగారు కుటుంబాలకు సంబంధించి 3,13,041 కుటుంబ సభ్యులను గుర్తించామని చెప్పారు.గుర్తించిన కుటుంబాలకు ఆర్థికంగా,సామాజికంగా ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ అభిషేక్‌గౌడ మాట్లాడుతూ మార్గదర్శకులంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు.

సాంబశివ కుటుంబాన్ని కలెక్టర్‌ దత్తత

పాడేరు మండలం ఐనాడ గ్రామానికి చెందిన గిరిజన రైతు కూలి సాంబశివ కుటుంబాన్ని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ దత్తత తీసుకున్నారు.ఈ కుటుంబానికి చెందిన మానస నీట్‌ పరీక్ష రాసిన ర్యాంకు రాకపోవడంతో నిరాశకు గురైంది.ఆమెను చదివించేందుకు తండ్రి సాంబశివ వద్ద ఆర్థికస్థోమత లేకపోవడాన్ని గుర్తించిన కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ మానసకు చదవు చెప్పించేందుకు ముందుకురావడంతో పాటు ఈ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా దత్తత తీసుకున్నారు.ఈ సందర్భంగా మానస మాట్లాడుతూ కలెక్టర్‌ పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ అభిషేక్‌గౌడ గుత్తులపుట్టు గ్రామంలోని ఓ గిరిజన కుటుంబాన్ని,సబ్‌కలెక్టర్‌ సౌర్యమన్‌పటేల్‌ పాడేరుకు చెందిన పాతిమా కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు.ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ సాహిత్‌,ఉప కలెక్టర్‌ ఎం.ఎస్‌.లోకేశ్వరరావు, సీపీవో ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

పేదలను ఆదుకునేందుకు మార్గదర్శిగా నిలవాలి

చింతూరు: నిరుపేదలను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ మార్గదర్శిగా నిలవాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌ అన్నారు. చింతూరు డివిజన్‌లో పీ4 కార్యక్రమం అమలు విషయంపై సోమవారం ఆయన ఐటీడీఏ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. డివిజన్‌లో ఈ పథకం అమలు నిమిత్తం 9,449 కుటుంబాలను గుర్తించినట్టు చెప్పారు. దీనికి సంబంధించి 46 గ్రామసభలు నిర్వహించినట్టు ఆయన తెలిపారు.

రిత్విక్‌ కుటుంబాన్ని దత్తత తీసుకున్న పీవో

పీ4 పథకంలో భాగంగా స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న మడకం రిత్విక్‌ అనే విద్యార్థి కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్లు పీవో అపూర్వభరత్‌ తెలిపారు. రిత్విక్‌ తల్లి విజయలక్ష్మి తన క్యాంపు కార్యాలయంలో పనిచేస్తుండగా తండ్రి చిన్న కూలిపనులు చేస్తుంటాడని ఆయన తెలిపారు. రిత్విక్‌ ఎంతో తెలివైన విద్యార్థి అని చదువులో ఎల్లప్పుడూ ముందుంటాడని వారి పేదరికాన్ని గమనించిన తాను ఆ కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రిత్విక్‌ విద్యకోసం కావాల్సిన ఆర్థికసాయం అందిస్తానని వారి కుటుంబానికి అండగా వుంటానని పీవో తెలిపారు. పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలి

రంపచోడవరం: జిల్లాలో బాగా పేదరికంలో ఉన్న వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసే విధంగా ఒక్కొక్క అధికారి ఒక్కో కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని రంపచోడవరం పీవో కట్టా సింహాచలం అన్నారు. ఐటీడీఏ సమావేశపు హాలులో సోమవారం పీ 4 ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సోమవారం సబ్‌ కలెక్టర్‌ కెఆర్‌ కల్పశ్రీతో కలిసి విలేకర్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ప్రతి ఐఏఎస్‌ అధికారి ఒక్కో కుటుంబాన్ని దత్తత తీసుకోనున్నట్టు చెప్పారు. సబ్‌ కలెక్టర్‌ కల్పశ్రీ మాట్లాడుతూ పేదరికంలో ఉన్న వారిని గుర్తించి, ఆర్థికంగా బలోపేతం చేయడమే పీ–4 కార్యక్రమం లక్ష్యమన్నారు. ఎస్‌డీసీ పి.అంబేడ్కర్‌, ఏపీవో డీఎన్‌వీ రమణ, అధికారులు పాల్గొన్నారు.

బంగారు కుటుంబాల దత్తతకు ముందుకు రావాలి 1
1/2

బంగారు కుటుంబాల దత్తతకు ముందుకు రావాలి

బంగారు కుటుంబాల దత్తతకు ముందుకు రావాలి 2
2/2

బంగారు కుటుంబాల దత్తతకు ముందుకు రావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement