
యువకుడికి విద్యుదాఘాతం
● పరిస్థితి విషమం
● పాడేరులోని జిల్లా ఆస్పత్రికి తరలింపు
ముంచంగిపుట్టు: మండలంలోని మారుమూల బుంగాపుట్టు పంచాయతీ రంగినిగూడ గ్రామంలో ఆదివారం రాత్రి 7గంటల సమయంలో వంతాల కొగేశ్వరరావు (19) అనే గిరిజన యువకుడు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఇంటిలో విద్యుత్ వైరు తెగిపోయి ఉండటాన్ని గమనించని యువకుడు దానిని పట్టుకోవడంతో కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ వాహనంలో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువచ్చారు. స్థానిక వైద్యాధికారి వివేక్ వైద్య సేవలు అందించారు.ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు, మండల నేత సింహాచలం బాధితుడు కొగేశ్వరరావును పరమర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు నిమిత్తం అంబులెన్స్‌లో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

యువకుడికి విద్యుదాఘాతం