
డి.యర్రవరంలో సినిమా షూటింగ్ సందడి
నాతవరం: మండలంలో డి.యర్రవరం గ్రామంలో గల నల్లకొండమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఆదివారం కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించారు. డైరెక్టరు వై.ఎస్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్ర హర్షిణి మూవీస్ బ్యానర్‌పై ‘జాగా’ అనే తెలుగు చలన చిత్రం ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి షూటింగ్ ప్రారంభించారు. పలు సన్నివేశాలు చిత్రీకరించారు. ములగపూడి ఎం.బెన్నవరం గ్రామాల్లో గల వ్యవసాయ భూములు, జీడిమామిడి తోటల్లో ఈ చిత్రంలో సర్పంచ్ పాత్ర వ్యవసాయదారుడి రైతులు మధ్య సంభాషణకు సంబంధించి పలు దృశ్యాలను చిత్రీకరించారు. చిత్ర ప్రధాన పాత్రధారులు ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాయిగణేష్‌లపై ఆలయంలో షూటింగ్ ప్రారంభించి తర్వాత పలు ప్రదేశాల్లో సన్నివేశాలు చిత్రీకరణ జరిపారు. సినిమా షూటింగ్ చూసేందుకు చుట్టు పక్కల గ్రామాలు అధిక సంఖ్యలో రావడంతో సందడి నెలకొంది. వెంకట పవన్‌కుమార్, లవకుమార్, బుజ్జి తదితర చిత్ర బృందం పాల్గొన్నారు.