
ఫలం
సీజన్ ప్రారంభంలోనే సీతాఫలం ధర పతనం కావడంతో గిరి రైతులు ఉసూరుమంటున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించినా మార్కెట్ పరిస్థితులు కలిసిరావడం లేదని వారు వాపోతున్నారు. వంట్లమామిడి పండ్ల మార్కెట్‌లో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధర తగ్గించేస్తున్నారని వారు వాపోతున్నారు. కనీసం రెక్కల కష్టం కూడా మిగలడం లేదని వారు ధ్వజమెత్తుతున్నారు.
దళారులకే
బుట్ట రూ.500కు మించి కొనుగోలు చేయక నష్టం
కొనేవారు
కరువయ్యారనిగిరి రైతుల ఆవేదన
సాక్షి,పాడేరు: మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న మన్యం సీతాఫలాలకు గిట్టుబాటు ధర కరువైంది. పాడేరు మండలంలోని వంట్లమామిడి, దేవాపురం, సలుగు, ఐనాడ, మోదాపల్లి, వనుగుపల్లి, జి.మాడుగుల మండలం వంతాల పంచాయతీల పరిధిలో సుమారు 500 ఎకరాల్లో గిరిజనులకు సీతాఫలం తోటలు ఉన్నాయి. ఏటా జూలై నుంచి డిసెంబర్ వరకు దిగుబడి ఉంటుంది. ప్రతి చెట్టుకు కనీసం రూ.2 వేల వరకు ఆదాయం లభిస్తుంది. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించాయి. ముందస్తు వర్షాలు తోటలకు మేలు చేయడంతో దిగుబడి బాగుంది. సీజన్ ప్రారంభంలో ధర కాస్త ఎక్కువగానే ఉండాలి. అలాంటిది బాగా తక్కువగా ఉండ టంతో సీతాఫలం రైతులు ఆవేదన చెందుతున్నారు
వ్యాపారుల ఇష్టారాజ్యం..
కోల్‌కతా మార్కెట్‌కు మన్యం సీతాఫలాలను వ్యాపారులు భారీగా తరలిస్తారు. అక్కడ వ్యాపారులు స్థానిక దళారీ వ్యాపారులు సిండికేట్‌గా మారి సీతాఫలాల ధరలను పతనం చేస్తున్నారు. దీంతో గిరిజన రైతులు నష్టపోతున్నారు.
● పాడేరు ఘాట్‌లోని వంట్లమామిడి జంక్షన్ పండ్ల అమ్మకాలకు ప్రసిద్ధి. ఇక్కడకు పరిసర గ్రామాల గిరిజన రైతులు సీజన్‌ను బట్టి పనస, పైనాపిల్, సీతాఫలం, రామఫలం, మామిడిని తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. ప్రతిరోజు ఉదయం వేళలో మార్కెట్ జరుగుతుంది. ప్రస్తుతం సీతాఫలం సీజన్ కావడంతో పరిసర మారుమూల గ్రామాల నుంచి గిరిజనులు బుట్టలు, కావిళ్లతో కాలినడకన ఒక్కడి మార్కెట్‌కు మోసుకుని తీసుకువస్తున్నారు.
వంట్లమామిడి మార్కెట్లో సీతాఫలాల ధర పతనం
పోషకాల మెండుతో గిరాకీ
తీవ్రంగా నష్టపోతున్నాం
సీతాఫలాలకు ధరలు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. మైదాన ప్రాంతంతో పాటు స్థానిక వ్యాపారులంతా కొనుగోలు ధరను తగ్గించేస్తున్నారు. గతంలో బుట్ట సీతాఫలాలను రూ.700నుంచి రూ.900 ధరకు అమ్ముకునేవాళ్లం. ప్రస్తుతం ఈఏడాది రెండు బుట్టల పండ్లను రూ.600 నుంచి రూ.800 కొంటున్నారు. దీనివల్ల నష్టపోతున్నాం.
– కొర్రా రత్తు, సీతాఫలం రైతు, చింతాడ, పాడేరు మండలం
సీతాఫలాల్లో ఔషధ విలువలు ఎక్కువగా ఉన్నందున వీటికి గిరాకీ పెరిగింది. ఈ పండ్లలో కెరోటిన్, థయామిన్, రిబోప్లేవిన్, నియాసిన్, విటమిన్ సీ వంటి ముఖ్య పోషకాలు ఉన్నాయి. వీటి ఆకులు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయి. అధిక బరువును తగ్గించడంతోపాటు జలుబు నివారణకు దోహదపడతాయి. జీర్ణక్రియ ప్రక్రియకు సీతాఫలం పండులో గుజ్జు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూర్చే సీతాఫలాలు పండించే రైతులకు మాత్రం ఆదాయాన్నివ్వలేకపోతున్నాయి.

ఫలం

ఫలం

ఫలం

ఫలం

ఫలం