
వెదురు ఉత్పత్తులతో పౌష్టికాహారం
సాక్షి,పాడేరు: గిరిజన ప్రాంతాల్లో వర్షాకాలంలో వెదురు ఉత్పత్తులు గిరిజనులకు పౌష్టికాహారం అందిస్తున్నాయి. అడవిని నమ్ముకుని జీవించే గిరిజనులంతా ఈ సీజన్‌లో వెదురు కొమ్ములు, కొక్కులను సేకరించి ఆహారంగా వండుకు తింటారు. కాలక్రమేణా మైదాన ప్రాంత వాసులకు కూడా వీటిని తినడం అలవాటైంది. జిల్లా అంతటా వెదురు వనాలు అధికంగా ఉన్నాయి. వర్షాలకు వెదురువనాల వద్ద ఏర్పడే చిగుళ్లను కొమ్ములుగా పిలుస్తుంటారు. వాటిని సేకరించి కూరగా తయారు చేసుకుని ఆహారంగా తీసుకుంటారు. ప్రస్తుతం నాలుగు కొమ్ములు రూ.50 వరకు ధర ఉంది. వెదురు పొదల వద్ద పుట్టకొక్కుల ఆకారంలో ఏర్పడే వాటిని గిరిజనులు కూరగా తయారుచేసుకుని తింటారు. ఇవి వాటా రూ.50 నుంచి రూ.100 వరకు ధర ఉంది. పోషక విలువలతో పాటు పీచు పదార్థం ఎక్కువగా ఉన్నందున ఆరోగ్యానికి మేలు చేస్తుందని గిరిజనులు చెబుతుంటారు.
వెదురు కొమ్ములు
కొమ్ములు, కొక్కుల సీజన్ ప్రారంభం
విరివిగా అమ్మకాలు
కూరగా తినేందుకు ఆసక్తి చూపుతున్న గిరిజనులు

వెదురు ఉత్పత్తులతో పౌష్టికాహారం