
రేపటి నుంచి టేబుల్ టెన్నిస్ రీజనల్ పోటీలు
ఎటపాక నవోదయ విద్యాలయంలో ఏర్పాట్లు పూర్తి
ఎటపాక: జవహర్ నవోదయ విద్యాలయాల రీజనల్ స్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడా పోటీలు ఈనెల 29 నుంచి 31 వరకు జరుగనున్నాయి. ఇందుకోసం స్థానిక జవహర్ నవోదయ విద్యాలయం వేదిక కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేసినట్లు విద్యాలయం వైస్ ప్రిన్సిపాల్ ప్రసాద్ తెలిపారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ రీజనల్ స్థాయి పోటీలకు ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, కేరళ, అండమాన్ నికోబార్, లక్షదీవుల జవహర్ నవోదయ విద్యాలయాల నుంచి సుమారు 90 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. విద్యాలయంలోని ఆడిటోరియంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం సాయంత్రానికి క్రీడాకారులు రానుండటంతో వారికి వసతి, భద్రత ఏర్పాట్లు కూడి చేసినట్టు వైస్ ప్రిన్సిపాల్ తెలిపారు. ఇప్పటికే ఆడిటోరియం, విద్యాలయాన్ని స్వాగత ఫ్లెక్సీలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

రేపటి నుంచి టేబుల్ టెన్నిస్ రీజనల్ పోటీలు