
మెరుగైన వైద్యం అందించాలి
రంపచోడవరం: రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆదేశాల మేరకు ఏడీఎంహెచ్‌వో డాక్టర్ డేవిడ్ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం సందర్శించారు. ఇక్కడ చికిత్స పొందుతున్న గంగవరం మండలం పిడతమామిడి పీహెచ్‌సీ ప్రాంతానికి చెందిన వీరలక్ష్మిని కలిసి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు అత్యవసర చికిత్స నిమిత్తం ఐటీడీఏ పీవో సింహాచలం చొరవతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. డ్యూటీ డాక్టర్‌తో మాట్లాడి వీరలక్ష్మికి అందిస్తున్న వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో రంపచోడవరం డివిజన్‌లో మారేడుమిల్లి, గెద్దాడ పీహెచ్‌సీల నుంచి వైద్యం కోసం వచ్చిన రోగులను పరామర్శించి వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. గిరిజన రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని వైద్యులకు సూచించారు.