
సూపర్ క్వాలిటీ దుస్తుల తయారీకి పూర్తి సహకారం
కూనవరం: చింతూరు డివిజన్‌లో సూపర్ క్వాలిటీ దుస్తులు తయారు చేసేందుకు పూర్తిసహకారం అందిస్తామని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.మల్లికార్జున్ నాయక్ తెలిపారు. పైదిగూడెంలోని పట్టు దుస్తుల శిక్షణ కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. మగ్గం ద్వారా బట్ట నేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఒకరు ఒక చీరె నేసేందుకు (తయారు చేసేందుకు) ఎంత సమయం పడుతుందని అక్కడ పనిచేస్తున్న మహిళలను అడిగారు. రెండు రోజుల సమయం పడుతుందని వారు తెలిపారు. 2021లో గిరిజన లబ్ధిదారు లు 50 మందికి పట్టు కాయల నుంచి దారం తీయడంలో శిక్షణ ఇప్పించామని, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తీసిన దారంతో దుస్తులు నేయడంలో శిక్షణ ఇప్పిస్తున్నామని ముఖ్య కార్యదర్శికి పీవో అపూర్వభరత్ వివరించారు. తయారైన దుస్తులకు ప్రింటింగ్, డైయింగ్, డిజైనింగ్ వర్క్స్ కొరకు మరో గోదాం ఏర్పాటు చేయడం జరుగు తుందని పీవో తెలిపారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మల్లికార్జున్ నాయక్ ఈ శిక్షణకు సంబంధించి పీవో కు కొన్ని సూచనలు చేశారు. అనంతరం చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం చింతూరు మండలంలోని ఆశ్ర మ బాలికల పాఠశాలను సందర్శించారు. 8వ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. ఏపీవో జగన్నాథరావు, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ మురళి, ఎస్‌ఐ లతశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పుల్లయ్య, రంపచోడవరం డీడీ రుక్మాండయ్య పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి మల్లికార్జున్ నాయక్

సూపర్ క్వాలిటీ దుస్తుల తయారీకి పూర్తి సహకారం