
అల్లూరి జిల్లాలో అధ్వానంగా విద్యావ్యవస్థ
మహారాణిపేట (విశాఖ): అల్లూరి సీతారామరాజు జిల్లాలో విద్యావ్యవస్థ అమలు సక్రమంగా లేదని పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. జెడ్పీ చైరపర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో డీప్యూటీ సీఈవో రాజ్‌కుమార్,ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతగిరి జెడ్పీటీసీ డి.గంగరాజు, అరకు జెడ్పీటీసీ శెట్టి రోషిణి మాట్లాడుతూ అల్లూరి జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో చాలామందికి చదవడం,రాయడం రాదన్నారు. దీనిని బట్టి విద్యా బోధన ఎలా ఉందోనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏకలవ్య పాఠశాలల్లో తొమ్మిది తరగతిలో ప్రవేశానికి పరీక్ష పెడితే చదవలేక (తరువాయి 8లో)
అరకు మండలంలో పరిస్థితి
మరింత దారుణం
జెడ్పీ చైర్‌పర్సన్ అధ్యక్షతన స్థాయీ
సంఘ సమావేశాల్లో
అరకు జెడ్పీటీసీ రోషిణి ఆవేదన