
ప్రభుత్వ భూమి గిరిజనులకే దక్కాలి
ఎటపాక: పోలవరం పరిహారం పొందిన ప్రభుత్వ భూములు గిరిజనులకే దక్కాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు డిమాండ్ చేశారు. శనివారం మురుమూరు,రాఘవాపురం గ్రామాల్లో భూపోరాట కమిటీ ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. పోలవరం పరిహారం పరిహారం పొందిన భూములు గిరిజనులకే చెందితాయని వాటిని గిగిరిజనులు సాగుచేసుకోవడంమే న్యాయబద్దం అన్నారు. 2007లో భూ నష్టపరిహారం పొందిన భూమిని ప్రభుత్వానికి స్వాధీన పర్చినప్పటికీ, ఆ భూములపై ఆదాయం పొందుతున్నారన్నారు. అట్టి భూములపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అవి ఎవరికి చెందుతాయనేది నిర్థారించాలన్నారు. తప్పుడు ఫిర్యాధులతో గిరిజనులను వేధించవద్దని కోరారు. ఏజెన్సీలో కౌలు వసూలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కాకా అర్జున్‌దొర ,నాయకులు సోందె రామారావు, పర్షిక ధర్మరాజు, సోయం వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.