నిర్మూలనకు చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

నిర్మూలనకు చర్యలు చేపట్టాలి

Jul 26 2025 9:18 AM | Updated on Jul 26 2025 9:18 AM

నిర్మూలనకు చర్యలు చేపట్టాలి

నిర్మూలనకు చర్యలు చేపట్టాలి

చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌

చింతూరు: డివిజన్లో మలేరియా నిర్మూలనకు యుద్ధప్రాతిపదికన తగిన చర్యలు చేపట్టాలని స్థానిక ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌ ఆదేశించారు. చింతూరులో వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాంటీలార్వా స్ప్రేయింగ్‌ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ డివిజన్‌ వ్యాప్తంగా గుర్తించిన 151 హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో వెంటనే యాంటీలార్వా స్ప్రేయింగ్‌ కార్యక్రమం నిర్వహించాలని, ఆయా ప్రాంతాల్లో పంచాయతీ సిబ్బంది ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలు, ఫాగింగ్‌ చేపట్టాలని ఆదేశించారు. యాంటీలార్వా స్ప్రేయింగ్‌ నిమిత్తం 8 పవర్‌స్ప్రేయర్లు, 45 బ్యాటరీ స్ప్రేయర్లు రప్పించామన్నారు. దోమల ద్వారా వ్యాప్తిచెందే మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా, మెదడువాపు వంటి వ్యాధుల నివారణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని పీవో సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ పుల్లయ్య, ఎంపీడీవో శ్రీనివాస్‌దొర, ఏఎంవో శ్రీనివాసరాజు, డాక్టర్‌ ఉదయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement