
●వర్షం కురిస్తే వణుకే..!
మండలాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణం, నిర్వహణ, ప్రతిపాదనలు తదితర అంశాలను మండల పరిషత్ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. ఇంతటి కీలకమైన వీరు
సొంత భవనానికి మరమ్మతులు చేపట్టలేకపోతున్నారు. ముంచంగిపుట్టులో సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మించిన మండల పరిషత్ భవనం శిథిలావస్థకు చేరుకుంది. కార్యాలయం ముఖద్వారం వద్ద శ్లాబ్ పెచ్చులూడిపోవడంతో రంధ్రం ఏర్పడింది. వర్షం పడినప్పుడల్లా కారిపోతుండటంతో విధులు నిర్వహించే సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని
ఎంపీపీ సీతమ్మ, మండల ప్రజలు కోరుతున్నారు. –ముంచంగిపుట్టు