
మందులు అందుబాటులో ఉంచాలి
● రంపచోడవరం ఐటీడీఏ పీవో
కట్టా సింహాచలం
రంపచోడవరం: ఏజెన్సీలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆదేశించారు. మండలంలోని సీతపల్లి పీహెచ్‌సీని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రికి సంబంధించిన వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. సీజనల్ వ్యాధులకు మందుల ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. పీహెచ్‌సీ పరిధిలో గర్భిణుల వివరాలను సిబ్బంది నుంచి తెలుసుకున్నారు. ప్రస్తుతం రోగుల సంఖ్య, అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.