
టీబీ రహిత జిల్లాగా కృిషి
పాడేరు : జిల్లాను టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా టీబీ వ్యాధి లక్షణాలు తెలిపే సెల్ఫీ స్టాండ్, ప్రచార గోడ పత్రికలను శుక్రవారం ఐటీడీఏ వద్ద ఆయన ప్రారంభించారు. ప్రజలంతా టీబీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉంటూ అవగాహన కలిగి ఉండాలన్నారు. టీబీ రహిత భారత్‌కు అందరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, డీఆర్వో పద్మలత, జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్, డీపీఎంవో డాక్టర్ కిరణ్‌కుమార్, సీసీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.