
కోరాపుట్ వరకే కిరండూల్ రైళ్లు
తాటిచెట్లపాలెం: విశాఖపట్నం–కిరండూల్–విశాఖపట్నం మధ్య నడిచే ప్రయాణికుల రైళ్లు భద్రతా పనుల నిమిత్తం కోరాపుట్ వరకు మాత్రమే రాకపోకలు సాగిస్తాయని వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ఈ నెల 26(శనివారం), 27వ తేదీల్లో విశాఖపట్నం–కిరండూల్ (18515) నైట్ ఎక్స్‌ప్రెస్ కోరాపుట్ వరకు మాత్రమే నడుస్తుంది. ఈ నెల 27, 28వ తేదీల్లో కిరండూల్–విశాఖపట్నం(18516) నైట్ ఎక్స్‌ప్రెస్ కోరాపుట్ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటుంది.
● ఈ నెల 27, 28వ తేదీల్లో విశాఖపట్నం–కిరండూల్ (58501) పాసింజర్ కోరాపుట్ స్టేషన్ వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో కిరండూల్–విశాఖపట్నం(58502) పాసింజర్ కోరాపుట్ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ మార్పులు గమనించాలని అధికారులు సూచించారు.