
పాడేరు ఎమ్మెల్యేకు ఘన సన్మానం
జి.మాడుగుల: వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నూతనంగా రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా పాంగి అంద్రయ్యను పార్టీ అధిష్టానం నియమించింది. దీంతో పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజును గురువారం ఆయన మర్యాదపూర్వకంగా కలిసి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ పార్టీని నమ్మకొన్న వారిని గుర్తించి పార్టీ పదవులేకారు ప్రభుత్వం వస్తే నామినేటెడ్ పదవుల కూడా వరిస్తాయన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ అభివృద్దికి కృషి చేయాలని, అలాగే మళ్లీ జగన్నన్న ముఖ్యమంత్రిగా చేయటానికి అందురూ సమిష్టిగా శ్రమించాలని ఆయన అన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు నుర్మని మత్స్యకొండంనాయుడు, క్రిస్టియన్ మైనార్టీ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు కృష్ణారావు, యూత్ అధ్యక్షుడు ప్రశాంత్, వైఎస్సార్‌సీపీ నాయకులు సోమలింగం, బంగార్రాజు, బాలన్న, రాధ తదితరలు పాల్గొన్నారు.