త్వరితగతిన ఏకలవ్య భవన నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

త్వరితగతిన ఏకలవ్య భవన నిర్మాణం

Jul 25 2025 4:39 AM | Updated on Jul 25 2025 4:39 AM

త్వరి

త్వరితగతిన ఏకలవ్య భవన నిర్మాణం

ముంచంగిపుట్టు: ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎం.అభిషేక్‌ గౌడ ఆదేశించారు. మండలంలోని జోలాపుట్టు పంచాయతీ లబ్బూరులో నిర్మిస్తున్న ఏకలవ్య పాఠశాలభవన నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఇంజినీరింగ్‌ అధికారులతో మాట్లాడి పనుల పురోగతిపై తెలుసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చేనెల15 నాటికి పనులు పూర్తి చేసి, పాఠశాలలను ప్రారంభించాలని ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఈఈ వేణుగోపాల్‌కు ఆదేశించారు. ఏకలవ్య పాఠశాల భవనాలు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని పరిసర గ్రామాల ప్రజలు జేసీని కలిసి విన్నవించారు. అనంతరం ఆయన పెదబయలులోని ఏకలవ్య పాఠశాలను తనిఖీ చేశారు.విద్యార్థుల వసతి, కిచెన్‌, డైనింగ్‌కు సంబంధించి పలు సూచనలు చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. వారి నుంచి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు పెట్టిన భోజన నాణ్యతను పరిశీలించారు. గురుకులం ఓఎస్డీ మూర్తి, ఎంపీడీవోలు సూర్యనారాయణమూర్తి, పూర్ణయ్య, తహసీల్దార్లు శంకరరావు, త్రినాథ్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్‌, ఏటీడబ్ల్యూవో స్వర్ణలత, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఏఈ రాయుడు, ఎంఈవో కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

పెదబయలు: మండలంలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలను జేసీ డాక్టర్‌ ఎంజే అభిషేక్‌ గౌడ గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. వారి నుంచి సమస్యలు తెలుసుకున్నారు. క్వార్టర్స్‌ సదుపాయం కల్పించాలని ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు కోరారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తరగతి గదులు, కిచెన్‌, డైనింగ్‌ హాల్‌ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

వచ్చే నెల 15 నాటికి పూర్తికి చర్యలు

జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ ఆదేశం

త్వరితగతిన ఏకలవ్య భవన నిర్మాణం 1
1/2

త్వరితగతిన ఏకలవ్య భవన నిర్మాణం

త్వరితగతిన ఏకలవ్య భవన నిర్మాణం 2
2/2

త్వరితగతిన ఏకలవ్య భవన నిర్మాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement