
విద్యార్థుల సామర్థ్యం మరింత మెరుగు పడాలి
పెదబయలు: విద్యార్థుల సామర్థ్యం మరింత మెరుగుపర్చాలని విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె.విజయభాస్కరరావు ఆదేశించారు. బుధవారం ఆయన స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయాన్ని సందర్శించారు. రికార్డులను పరిశీలించారు.అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యాబోధనను, విద్యార్థుల నోట్ పుస్తకాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.టైం టేబుల్ ప్రకారం పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం వారితో నిర్వహించిన సమావేశంలో పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంఈవో పుష్పజోసెఫ్, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విద్యాశాఖ ఆర్‌జేడీ ఆర్‌జేడీ విజయభాస్కరరావు

విద్యార్థుల సామర్థ్యం మరింత మెరుగు పడాలి