
శ్రద్ధగా చదువుకోవాలి
అరకులోయ టౌన్: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, శ్రద్ధగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సూచించారు. బుధవారం మండలంలోని రవ్వలగుడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులను పరిశీలించారు. వీరికి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వంటశాల పరిశుభ్రంగా లేకపోవడంపై నిర్వాహకులను మందలించారు. వసతి గృహ పరిసరాలు, వంటశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులను సిక్ రూమ్‌లో ఉంచాలని, వెంటనే మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాలన్నారు. జగనన్న పాలనలో నాడు–నేడు పథకాలను పాఠశాలలను తీర్చిదిద్దిన తీరు, డిజిటల్ క్లాస్ రూమ్ కాన్సెప్ట్, ఎల్‌ఈడీ స్క్రీన్, ఇంటర్నెట్ సదుపాయంతో విద్యార్థులకు అందిస్తున్న బోధనను చూసి ఆనందం వ్యక్తం చేశారు. హెచ్‌ఎం టి.నాగేశ్వరరావు, హెచ్‌డబ్ల్యూవో రామ్మూర్తి పాల్గొన్నారు.
విద్యార్థులకు ఎమ్మెల్యే మత్స్యలింగం సూచన