
డుంబ్రిగుడలో భారీ వర్షం
డుంబ్రిగుడ: మండలంలో సోమవారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భీకర శబ్దాలతో పిడుగులు పడడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పలు చోట్ల చెట్లకొమ్ములు విరిగి పడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డుంబ్రిగుడలోని ఓ శుభకార్యంలో ఏర్పాటు చేసిన స్వాగత బోర్డుతో పాటు టెంట్లు పడిపోయాయి.
నేడు మోదమ్మ అనుపోత్సవం
సాక్షి,పాడేరు: పాడేరులో మోదకొండమ్మతల్లి ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. ఉత్సవాల చివరి రోజు మోదకొండమ్మతల్లి అనుపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు.మధ్యాహ్నం సతకంపట్టు నుంచి మోదకొండమ్మతల్లి ఉత్సవ విగ్రహం,పాదాలు,ఘటాల ఊరేగింపు ప్రారంభమవుతుందన్నారు.సాంస్కృతిక కళాప్రదర్శనలు, నేల వేషాలు, డప్పు వాయిద్యాలతో అనుపోత్సవం జరుగుతుందన్నారు.అన్ని వర్గాల భక్తులు ఈ ఉత్సవానికి భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే కోరారు.