‘నా బిడ్డ ప్రాణం కాపాడండి’

Premature Baby Born With Health Complications Donate And Save His Life - Sakshi

బెంగళూరు సమీప గ్రామానికి చెందిన కృష్ణప్ప నేత పనిచేసేవాడు. నెలకు రూ. 6000ను సంపాదించే కృష్ణప్పకు, గౌరమ్మతో వివాహం జరిగింది. వీరికి వివాహమై ఏడాది కావస్తుంది. కృష్ణప్ప భార్య గర్భం దాల్చడంతో ఇరువురు సంతోషంతో మునిగిపోయారు. డిసెంబర్‌ మొదటి వారంలో మా ఇంట్లోకి మరో వ్యక్తి వస్తారానే ఆనందంతో ఉప్పొంగిపోయారు. దురదృష్టవశాత్తూ గౌరమ్మ నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చింది.  

సాధారణ నవజాత శిశువు సుమారు 3.5 కేజీల బరువు ఉంటారు. 30 వారాలలోపే గౌరమ్మ బిడ్డకు జన్మనివ్వడంతో శిశువు కేవలం 1.2 కిలోల బరువుతో పుట్టాడు. ఇప్పడు అదే శిశువు ప్రాణాలమీదకు వచ్చింది. ఆ బిడ్డను కాపాడేందుకు దంపతులు చేయరాని ప్రయత్నాలను చేస్తున్నారు. ఎలాగైనా తమ బిడ్డను బతికించాలనే ఆశతో వైద్యులను కలిశారు. వైద్యులు బిడ్డను కాపాడుకోవాలంటే 30 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు  సూచించారు.

శిశువు వైద్యం కోసం  గౌరమ్మ, కృష్ణప్ప దంపతులు ఇప్పటివరకు రూ.2 లక్షల వరకు అప్పుచేయాల్సి వచ్చింది. కొన్ని రోజులపాటు ఆసుపత్రితో ఉంటే మా బిడ్డను రక్షించుకోవచ్చునని వైద్యులు అన్నారు. అందుకుగాను వైద్యం కోసం ఇంకా రూ. 5 లక్షలు అవసరమవుతాయని వైద్యులు తెలిపారు. మా బిడ్డను రక్షించడం కోసం మీ తోచినంతా సహాయం చేయగలరని ఆశిస్తున్నాము. (అడ్వటోరియల్‌)


సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Advt News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top