ఇంక్యుబేటర్‌కే పరిమితం.. దయతో సహాయం చేయండి

My Premature Baby Needs To Kept In ICU For Next 6 Weeks Please Help  - Sakshi

పిల్లలు లేక ఆ దంపతులు ఎంతో నరకం అనుభవించారు. వారు తిరగని డాక్టర్లు లేరు, మొక్కని దేవుడు లేడు. చివరకు ఒక దశలో అన్ని ఆశలు వదులుకున్న సమయంలో 11 ఏళ్ల తర్వాత జయలక్ష్మీ-ప్రకాష్‌ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఎన్నేళ్ల నుంచో ఎదురుచూస్తున్న అనుభూతి కొన్ని క్షణాల్లోనే ఆవిరైంది. వారు తమ బిడ్డను చేతుల్లోకి తీసుకొని మురిసిపోలేని పరిస్థితి ఎదురైంది. 

నెలలు నిండకుండానే పుట్టిన శిశువు కావడంతో పుట్టగానే ఇంక్యుబేటర్‌కే పరిమితం అయ్యాడు. దీనికి తోడు శ్వాససంబంధిత  సమస్యలతో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.  కెటో ఇండియాస్‌ మోస్ట్‌  క్రౌండ్‌ ఫండింగ్‌ సైట్‌ చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి  ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం.

నేను  ఏడవనెలలో ఉండగానే ఆరోగ్యం క్షీణించింది. తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులు అత్యవసరంగా డెలివరీ చేయాల్సి వచ్చింది.  అప్పటికీ బిడ్డ బరువు కేవలం 600 గ్రాములు మాత్రమే. ప్రీమెచ్యూరిటీతో పాటు శ్వాసకోశ సంబంధిత వ్యాధి కూడా ఉన్నట్లు అప్పుడే నిర్ధారణ అయింది. డెలీవరీ తర్వాత నా బిడ్డను చూసే సమయానికి బాబు చిన్న పెట్టెలో ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ కనిపించాడు. అతని శరీరం మొత్తం సూదులు, పైపులతో నిండి ఉన్న దృశ్యం చూసి ఎంతటి నరకం అనుభవిస్తున్నామో మాటల్లో చెప్పలేను. మరో ఆరు వారాల పాటు చిన్నారిని ఐసీయూనే ఉంచాలని డాక్టర్లు చెప్పారు. ఇందుకోసం దాదాపు 78 లక్షల 40 వేలు అవుతుందని చెప్పారు.


అంత డబ్బును మేం ఎంత ప్రయత్నించిన తీసుకురాలేము. మాకు కన్నీళ్లు ఆగడం లేదు. ప్రకాష్‌ ఓ ఆఫీసులో అటెండర్‌గా పనిచేసేవాడు. సంతానోత్పత్తి చికిత్స కోసం చాలా మేం దాచుకున్న డబ్బుల్లో చాలావరకు ఖర్చయ్యాయి. ఇప్పటికే ప్రకాష్‌ అప్పుల్లో కూరుకుపోయాడు. దీనికి తోడు కొన్ని కారణాల వల్ల ఆయన ఉద్యోగం కూడా పోయింది. 11ఏళ్లు చూసిన ఎదురుచూపులకి మా బిడ్డ ఈ లోకాలనికి వచ్చి మా జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చింది. కానీ ఇప్పుడు మా బిడ్డ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.

డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు.  మా పేదరికం కారణంగా బాబుకు  ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలవు. దయచేసి మా బిడ్డను కాపాడండి.

కెటో ఇండియాస్‌ మోస్ట్‌ క్రౌండ్‌ ఫండింగ్‌ సైట్‌ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్)


 

Read latest Advt News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top