జివెన్‌ ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

జివెన్‌ ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు

Sep 20 2026 6:36 AM | Updated on Sep 20 2026 6:36 AM

నిర్మల్‌టౌన్‌: నిర్మల్‌కు చెందిన జివెన్‌ చిన్న వయస్సులోనే అసాధారణ ప్రతిభ కనబరుస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాడు. న్యూరాలజిస్ట్‌ అల్లూరు మనోజ్‌ భరత్‌, పీడియాట్రిషియనన్‌ దివ్య దంపతుల రెండున్నరేళ్ల కుమారుడు జివెన్‌ తన జ్ఞాపకశక్తి, విషయాలను వేగంగా గుర్తించే సామర్థ్యంతో పురస్కారాలు సొంతం చేసుకున్నాడు. ఇంటర్నేషనల్‌ స్టార్‌ కిడ్స్‌ అవార్డ్స్‌ సంస్థ ‘ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెమరీ’ విభాగంలో ‘స్టార్‌ కిడ్‌’ అవార్డుతో సత్కరించింది. ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నుంచి ‘సూపర్‌ టాలెంటెడ్‌ కిడ్‌’, ‘వనన్‌ ఇన్‌ఏ మిలియన్‌’గా గుర్తింపు పొందాడు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ కూడా జివెనన్‌ను ‘ఐబీఆర్‌ అచీవర్‌’గా ఎంపిక చేసింది. 100 రకాల జంతువులు, పక్షులు, కీటకాలను గుర్తించి పేర్లు చెప్పగలుగుతున్నాడు. 70 రకాల వాహనాలు, 50 కార్ల లోగోలు, 24 రంగులు, 12 ఆకారాలు, 39 రకాల పండ్లు, కూరగాయలను గుర్తించే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. చిన్నప్పటి నుంచే కుమారుడి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ కొత్త విషయాలను నేర్చుకునేలా చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement