భీమిని: మండలంలోని చిన్నతిమ్మపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని తంగేళ్ళపల్లి గ్రామానికి వెళ్లాలంటే తప్పనిసరిగా వాగు దాటాల్సిందే. మండలా ల విభజనలో కొమురంభీం జిల్లా దహేగాం మండలంలోని చిన్నతిమ్మపూర్ గ్రామ పంచాయతీ భీ మిని మండలంలో విలీనమైంది. దీంతో ప్రస్తుతం గ్రామస్తులకు దహేగాం మండలం నుంచి వైద్యసే వలు అందుతున్నాయి. శనివారం వైద్య సిబ్బంది గ్రామానికి వెళ్లి వైద్య సేవలు అందించారు. తిరుగు ప్రయాణంలో దహేగాంకు వెంకటాపూర్, మాడవెల్లి, సాలీగాం మీదుగా వాహనంలో పలువురు వైద్య సిబ్బంది వెళ్ళారు. కాగా చిన్నతిమ్మపూర్‌కు చెందిన ఆశ కార్యకర్త వెంకుబాయి తంగేళ్ళపల్లి నుంచి చిన్నతిమ్మపూర్‌కు వెళ్ళేందుకు ఎర్రవాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో స్థానికులు దగ్గరుండి దా టించారు. వర్షాకాలంలో అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తంగేళ్ళపల్లి, చిన్నతిమ్మపూర్ మ ధ్యలో ఎర్రవాగుపై వంతెన నిర్మించి తమకష్టాలు తీర్చలాని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


