ఖిలావరంగల్: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.రామచంద్రం అన్నారు. వరంగల్ బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల క్రీడామైదానంలో వాగ్దేవి కళాశాల ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేయూ యూనివర్సిటీ అండ్ కాలేజ్ 2026–27 క్రీడోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రార్ రామచంద్రం క్రీడోత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ తదితర ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 780 మందితో మహిళా క్రీడోత్సవాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ నెల 19 నుంచి 21 వరకు కబడ్డీ, సాఫ్ట్‌బాల్, బాస్కెట్‌బాల్, బాల్ బ్యాడ్మింటన్, క్రాస్ కంట్రీ తదితర క్రీడా పోటీలు కొనసాగనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రొఫెసర్ టి.శాస్త్రి, వాగ్దేవి కళాశాల డైరెక్టర్ వాణిదేవి, హెచ్.సుదర్శన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సునీల్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవీందర్, ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.


