ఆదిలాబాద్‌టౌన్: ‘రిమ్స్‌లో రీల్స్ మోజు’ శీర్షికన ఈనెల 15 ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈమేరకు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ స్పందించారు. విచారణకు ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించారు. ఇందులో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ విద్యావిల్సన్, ప్రొఫెసర్లు కరుణాకర్, సందీప్ జాదవ్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్లు దీపక్ పుష్కర్, నరేందర్ బండారి ఉన్నారు. వైద్య విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్టు చేసిన రీల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు తెలిపారు. అభ్యంతకరంగా ఉన్నట్లయితే వర్సిటీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ పేర్కొన్నారు.


