ఉమ్మడి జిల్లాలో పెరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు నాలుగు శాసనసభ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానం మహిళలకు నాలుగు స్థానాలు రిజర్వ్ అయ్యే అవకాశం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శాసనసభ, లోక్‌సభ స్థానాలు పెరగనున్నా యి. దీంతో నాయకులకు అవకాశాలూ రానున్నా యి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ల పెంపు కోసం బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల్లోనే దేశవ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభ స్థానాల సంఖ్య పెంచేందుకు పునర్విభజన బిల్లు ఆమోదం కోసం చర్చ జరుగుతోంది. ఇక నియోజకవర్గాల పు నర్విభజన కోసం డీ లిమిటేషన్ కమిషన్ కూడా ఏ ర్పాటు చేస్తున్నారు. దీంతో ఒకేసారి అటు మహిళా నాయకులకు అవకాశాలు, ఇటు సీట్ల పెంపుతో అందరికీ అవకాశాలు పెరగనున్నాయి. రాష్ట్రంలో 50 శాతం చొప్పున స్థానాలు పెంచితే రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు పెరుగుతాయి. ఇప్పుడు 543 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. ఈ సంఖ్య 850కి చేరుతుంది. రాష్ట్రంలో ఎంపీ స్థానాలు ప్రస్తుతం 17ఉండగా.. కొత్తగా తొమ్మిది పెరిగి ఆ సంఖ్య 26 స్థానాలకు చేరుతుంది. ఇక రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా 179 స్థానాలకు పెరుగుతాయనే అంచనా ఉంది. కొత్తగా 60 స్థానాలు పెరగనున్నా యి. 2011 ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనాభా 19 లక్షలు ఉంది. మహిళా జనాభా అధికంగా ఉండడంతో ఇక్కడ సీట్లు కూడా మహిళలకు రిజర్వ్ కానున్నాయి. ప్రస్తుతం మహిళా బిల్లు, డీ
లిమిటేషన్ బిల్లులపై పార్లమెంట్‌లో చర్చ కొనసాగుతోంది. పార్లమెంట్‌లో ఆమోదం పొందితే మహిళలకు అవకాశాలు కలుగనున్నాయి. పునర్విభజన బిల్లుతో కొత్త స్థానాలు ఏర్పడనున్నాయి.
ఎవరికి వారే అంచనాల్లో..
ఉమ్మడి జిల్లాలో కొత్తగా నియోజకవర్గాల పెంపుతో రాజకీయ ముఖచిత్రమే మారనుంది. ప్రస్తుతం పది అసెంబ్లీ స్థానాలైన ఆదిలాబాద్, బోథ్, ముథోల్, నిర్మల్, ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, చె న్నూరు, సిర్పూర్, ఆసిఫాబాద్ ఉండగా, లోకసభ స్థానాలు ఆదిలాబాద్, పెద్దపల్లి ఉన్నాయి. వీటికి అదనంగా మరో నాలుగు లేదా ఐదు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయనే అంచనా ఉంది. మొత్తం స్థానాలు 14లేదా 15కావొచ్చు. ఇక లోకసభ స్థానం కొత్తగా ఒకటి ఏర్పడే అవకాశం ఉంది. దీంతో కొత్తగా కనీసం ఐదు నుంచి ఆరుగురు ప్రజాప్రతినిధులు చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఏ నియోజకవర్గం, ఏ మండలంతో కొత్త నియోజకవర్గం ఏర్పడుతుందని ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కూడా మారనున్నాయి. మహిళలకు 33 శాతం కోటా అమలుతో ఉమ్మడి జిల్లాలో కనీసం నాలుగు స్థానాలు రిజర్వ్ కానున్నాయి. నలుగురు ఎమ్మెల్యేలుగా అయ్యే అవకాశముంది. ఇక ఎస్సీ, ఎస్టీ, జనరల్ స్థానాల్లోనూ మార్పులు, చేర్పులు రా నున్నాయి. దీంతో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహా, మాజీలు, రాజకీయ ఆశావహులు ఎక్కడ పో టీ చేయాలో అని అంచనాలు వేసుకుంటున్నారు. ఇక మహిళలకు రిజర్వ్ చేసిన చోట్ల తమ కుటుంబ సభ్యుల నుంచి మహిళా నాయకులను ప్రోత్సహించనున్నారు. కొన్ని చోట్ల తమ మండల కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి. అయితే, జిల్లా భౌగోళిక సరిహ ద్దు, జనాభాను బట్టి ఏ ప్రాంతం కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడుతుందనేది ఇంకా స్పష్టత లేదు.
2011 ప్రకారం ఉమ్మడి జిల్లాలో..


