చట్టాలపై అవగాహన అవసరం
ఆదిలాబాద్: బాలికల రక్షణ కోసం చేసిన చ ట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని జిల్లా జడ్జి ప్రభాకరరావు అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో ఐపీ స్టేడియంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. బాలికల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. వారి కోసం చట్టాలతో పాటు ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేశాయన్నారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి, న్యాయమూర్తులు లక్ష్మీకుమారి, హుస్సేన్, తేజస్విని, దివ్యవాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేశ్, పీపీలు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసిక ప్రశాంతత
క్రీడలతో మానసిక ప్రశాంతత చేకూరుతుంద ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకరరావు అన్నారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మా ట్లాడారు. పనిఒత్తిడిని దూరం చేసేందుకు క్రీడ లు ఎంతగానో దోహదపడతాయన్నారు.ఇందు లో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.


