బాసరలో భక్తుల అస్వస్థత
బాసర : వసంత పంచమి ఉత్సవాల సందర్భంగా బాసర శ్రీజ్ఞాన సరస్వతీ క్షేత్ర దర్శన క్యూలైన్‌లో నిలబడిన ఓ భక్తుడు అస్వస్థతక గురయ్యాడు. వెంటనే స్పందించిన హోంగార్డులు అతడిని సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. మంచిర్యాలకు చెందిన సిద్ధం తిరుపతి కుటుంబ సభ్యులతో కలిసి బాసర అమ్మవారి దర్శనానికి వచ్చారు. క్యూలైన్‌లో నిల్చున్నప్పుడు ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో హోమ్ గార్డులు ఇంద్రకరణ్‌డ్డి, గణేశ్, నారాయణ తక్షణం స్పందించి తిరుపతికి సీపీఆర్ చేశారు. ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడే ఉన్న వైద్యులు వచ్చి పరిశీలించారు. అనంతరం 108లో ఆసుపత్రికి తరలించారు.
స్పృహ తప్పిన భక్తురాలు..
ఇక అమ్మవారి దర్శనానికి హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ భక్తురాలు క్యూలైన్‌లోనే కళ్లుతిరిగి పడిపోయారు. సుమారు 3 గంటలు క్యూలో నిలబడి స్పహ తప్పారు. సీసీ సాయిలు, కానిస్టేబుల్ రాము ఆలయ ఈవో అంజనా దేవికి సమాచారం ఇచ్చా రు. 108 అంబులెన్స్‌లో చికిత్సకు తీసుకెళ్లారు. బాసర మండలం మైలాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు అవస్థకు గురయ్యారు. ఏఎస్సైలు సాయికిరణ్, గణేశ్, సాయికుమార్, ఆర్‌ఎస్సైలు స్పందించి 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
బాసరలో భక్తుల అస్వస్థత
బాసరలో భక్తుల అస్వస్థత


