ఘనంగా ‘బేతల్’
ఇంద్రవెల్లి: ఈనెల 18న మహాపూజతో కేస్లాపూర్‌లో నాగోబా జాతరను ప్రారంభించిన మెస్రం వంశీయులు శుక్రవారం గోవడ్ వద్ద బేతల్ అనంతరం సంప్రదాయ పూజలు ముగించారు. ముందుగా వంశపెద్దలు సంప్రదాయ వాయిద్యాల మధ్య గోవడ్‌కు చేరుకున్నారు. మహిళలు, భేటింగ్ అయిన కొత్త కోడళ్లు వారి ఆశీర్వదం తీసుకున్నారు. పర్ధాన్ కితకు చెందిన వారికి కానుకలు అందించారు. అనంతరం వంశ పెద్దలు ప్రదర్శించిన బేతల్ నృత్యాలు ఆకట్టుకున్నాయి. సతీదేవత ఆలయం ద్వారా కానుకల రూపంలో ఈ సారి రూ.1,01,780 వచ్చినట్లు ఆలయ పీఠాధిపతి వెంకట్‌రావ్ తెలిపారు. మహాపూజకు తీసుకొచ్చిన కొత్త కుండలను కితల వారీగా మెస్రం వంశీయులకు పంపిణీ చేశారు. సంప్రదాయ పూజలు ముగించిన వంశీయులు రాత్రి ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ బుడుందేవ్ ఆలయానికి బయలుదేరారు. ఈ నెల 25న అక్కడి ఆలయంలో పూజలు చేసి జాతర ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో వంశ పెద్దలు బాదిరావ్‌పటేల్, కోసు కటోడ, కోసేరావ్, దాదారావ్, తిరుపతి, తదితరులున్నారు.
కొనసాగుతున్న జాతర
కేస్లాపూర్‌లో నాగోబా జాతర కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. శుక్రవారం గంటల తరబడి క్యూలో నిల్చొని నాగోబాను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వసంత పంచమి పురస్కరించుకొని మెస్రం వంశీయులు తమ చిన్నారులకు ఆలయ ప్రాంగణంలో అక్షరాభ్యాసం చేయించారు. ఈనెల 25 వరకు అధికారికంగా జాతర కొనసాగుతుందని ఈవో ముక్త రవి తెలిపారు.
ఘనంగా ‘బేతల్’
ఘనంగా ‘బేతల్’


