‘తిరుమల’లో వైభవంగా సరస్వతీ హోమం
రాజమహేంద్రవరం రూరల్: కాతేరులోని తిరుమల విద్యా సంస్థల ఆవరణలో శుక్రవారం నాగాబట్ల కామేశ్వరశర్మ ఆధ్వర్యంలో వింజమూరి సుబ్బారావు బృందంచే సరస్వతీ హోమం ఘనంగా నిర్వహించారు. తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు, సరోజినీదేవి దంపతులు ఈ హోమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. 22 వేల మంది విద్యార్థులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి నున్న తిరుమలరావు మాట్లాడుతూ విద్యార్థులంతా విద్యతో పాటు, మంచి బుద్ధిని కలిగి ఉండాలన్నారు. తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడంతో ఎంత శ్రమ ఉన్నప్పటికీ, ఆ భగవంతుని ఆశీస్సులు కూడా అవసరమన్నారు. తమపై తమకు విశ్వాసం పెంపొందించుకోడానికి ఈ హోమం ఎంతో బలాన్ని ఇస్తుందని అన్నారు. కార్యక్రమంలో తిరుమల విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, విద్యార్థులు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.


