అడ్మిషన్ల దందాపై పోరాటం
కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు పీఆర్వోలను నియమించుకుని ఇంటర్ ప్రవేశాల కోసం చేస్తున్న అసత్య ప్రచారాన్ని కట్టడి చేయాలి. పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాకుండానే తాయిలాలు ప్రకటిస్తూ అసత్య ప్రచారం చేసేవారిని అడ్డుకోవాలి. అడ్మిషన్ల దందాపై పోరాట కార్యక్రమాలు రూపొందిస్తాం.
–బి.సిద్ధూ, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పీడీఎస్‌యూ, రామచంద్రపురం
వ్యాపారంగా విద్య
ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల పీఆర్వోలు తల్లిదండ్రుల నంబర్లు సేకరించి మాట్లాడి మభ్యపెడుతున్నారు. ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రభుత్వం ప్రకటించే వరకూ చేపట్టరాదు. అయితే విద్యను వ్యాపారంగా మార్చేస్తున్నారు. టాలెంట్ టెస్ట్‌లు, అవగాహన సదస్సుల పేరుతో కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల అసత్య ప్రచారాన్ని నియంత్రించాలి.
– సింహాద్రి కిరణ్‌కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీడీఎస్‌యూ, రాజమహేంద్రవరం
అడ్మిషన్ల దందాపై పోరాటం


