చికిత్స పొందుతూ బాలుడి మృతి
అంబాజీపేట: కొబ్బరి తోటలో అంటించిన మంటల్లో ప్రమాదవశాత్తూ పడి ఓ బాలుడికి తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంబాజీపేట పోలీసుల కథనం ప్రకారం.. పుల్లేటికుర్రు వ్యాఘ్రేశ్వరం గ్రామానికి చెందిన పొలిశెట్టి శ్రీరామనిరంజన్ (14) ఈ నెల 13న తన తండ్రితో కలసి కొబ్బరి తోటకు వెళ్లాడు. అక్కడ కూలీలు చెత్తకు నిప్పుపెట్టగా ఆ మంటల్లో ప్రమాదవశాత్తూ శ్రీరామనిరంజన్ కాలుజారి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి సోదరుడు శ్రీలింగనందన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.చిరంజీవి తెలిపారు.
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
లారీ ఢీకొని
మూగజీవాల మృతి
చింతూరు: మండలంలోని సరివెల వద్ద జాతీయ రహదారి–30పై శుక్రవారం రాత్రి లారీ ఢీకొనడంతో తొమ్మిది మూగజీవాలు మృతి చెందాయి. ఆవులను విక్రయించేందుకు ఒడిశా నుంచి తెలంగాణకు కాలినడకన తీసుకు వెళ్తున్న క్రమంలో భద్రాచలం వైపు నుంచి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్తున్న లారీ వేగంగా వస్తూ రహదారి దాటుతున్న ఆవులను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో తొమ్మిది మూగజీవాలు చెల్లాచెదురుగా పడి అక్కడికక్కడే మృతి చెందగా, మరికొన్నింటికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఢీకొన్న లారీ ఆగకుండా వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు.


