సరస్వతీ నమస్తుభ్యం | - | Sakshi
Sakshi News home page

సరస్వతీ నమస్తుభ్యం

Jan 24 2026 7:27 AM | Updated on Jan 24 2026 7:27 AM

సరస్వ

సరస్వతీ నమస్తుభ్యం

బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారి దర్శనానికి 4 గంటల సమయం ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన శైలజ రామయ్యర్‌

(రూ.లలో) టికెట్లు (రూ.లలో)

బాసర: జ్ఞానసరస్వతీదేవి పుట్టిన రోజు అయిన మా ఘ శుద్ధ పంచమిని వసంత పంచమిగా నిర్వహిస్తా రు. శుక్రవారం వసంత పంచమి కావడంతో నిర్మల్‌ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతీ క్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి వేలమంది అమ్మవారి దర్శనం, చిన్నారుల అక్షరాభ్యాస పూజల కోసం వచ్చారు. గురువారం అర్ధరాత్రి దాటిన వెంటనే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో స్నానఘట్టాలు నిండిపోయాయి.

దర్శనానికి 4 గంటల సమయం..

వెకువజామున 2 గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీ రారు. అమ్మవారి దర్శనానికి 4 గంటల సమ యం పట్టింది. ఇక చాలా మంది భక్తులు బాసరకు పాదయాత్రగా వచ్చారు. వీరిని సిబ్బంది ప్రత్యేకంగా మండపాలకు మళ్లించారు. గంగమ్మతల్లి, సూర్యేశ్వరస్వామి, కాళీమాత వ్యాసగుహవద్దకూడా భక్తుల రద్దీ నెలకొంది.

అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

వసంత పంచమి సందర్భంగా బాసర సరస్వతీ దేవి ఆలయాన్ని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. తె ల్ల్లవారుజామున 1:30 నుంచే జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవారులకు అభిషేకం, మంగళ వాయిద్య, సుప్రభాత, కుంకుమార్చనలు జరిగాయి. వైదిక బృందం అంకురార్పణ చేసింది. అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు.

ప్రిన్సిపల్‌ సెక్రెటరీ పట్టు వస్త్రాలు

దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజ రామయ్యర్‌ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దర్శనం తర్వాత ఆలయ అధికారులు ఆశీర్వదించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తుందని, గోదావరి పుష్కరాలకు రూ.200 కోట్ల మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తుందని తెలిపారు. నిర్మల్‌, ముధోల్‌ ఎమ్మెల్యేలు, భైంసా సబ్‌ కలెక్టర్‌, ఈవోలు పాల్గొన్నారు.

అమ్మవారిని దర్శించుకున్న ప్రాముఖులు..

నిర్మల్‌ జిల్లా జడ్జి శ్రీవాణి, నిర్మల్‌, ముధోల్‌ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌డ్డి, రామారావు పటేల్‌ నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, భైంసా సబ్‌కలెక్టర్‌ అజ్మీర్‌ సంకేత్‌ కుమార్‌ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

పటిష్ట పోలీస్‌ బందోబస్తు

వసంత పంచమి నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సీ జానకీషర్మిల తెలిపారు. ఏఎస్పీలు రాజేశ్‌మీనా, సాయికిరణ్పాటు 8 మంది సీఐలు, 22 మంది ఎస్సైలు, ముగ్గురు మహిళా ఎస్సైలు, 15 మంది ఏఎస్సైలు, 340 మంది పోలీసులు, మంది మహిళా సిబ్బంది, 64 మంది హోంగార్డులు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు.

ఆదాయం రూ.56.38 లక్షలు

బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయానికి భారీ ఆదాయం సమకూరింది. వివిధ ఆర్జిత సేవల టికెట్ల విక్రయంతో మొత్తం రూ.56,38,275 వచ్చింది. 6,325 చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించినట్లు ఈవో అంజనాదేవి తెలిపారు.

టికెట్లవారీగా ఆదాయ వివరాలు..

సేవ రకం ధర విక్రయించిన ఆదాయం

అక్షరాభ్యాస పూజ 1,000 3,850 38,50,000

అక్షరాభ్యాస పూజ 150 2,475 3,71,250

ప్రత్యేక దర్శనం 100 5,770 5,77,000

లడ్డూ ప్రసాదం 25 23,771 5,94,275

పులిహోర ప్రసాదం 20 12,300 2,46,000

సరస్వతీ నమస్తుభ్యం1
1/3

సరస్వతీ నమస్తుభ్యం

సరస్వతీ నమస్తుభ్యం2
2/3

సరస్వతీ నమస్తుభ్యం

సరస్వతీ నమస్తుభ్యం3
3/3

సరస్వతీ నమస్తుభ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement