కొత్త కార్యవర్గం ఎన్నిక
బాలాజీచెరువు: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ పింఛనుదారుల సంక్షేమ సంఘం కొత్త కార్యవర్గం ఎన్నికను శుక్రవారం కాకినాడలోని జిల్లా కేంద్రం గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. సంఘ అధ్యక్షులు ఎం.సంజయశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర ప్రతినిధి కె.త్రిమూర్తులు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. సంఘ గౌరవ అధ్యక్షుడిగా గట్టి రామారావు, అఽధ్యక్షుడిగా సలాది సాయి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఎ.రామారావు, కోశాధికారిగా ఆర్.వీరభద్రరావు, మహిళా కార్యదర్శిగా డి.వాణిశ్రీ ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారులుగా సీహెచ్ నాగేశ్వరరావు, ఐవీ రామరాజులు కొనసాగనున్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు సలాది సాయి సత్యనారాయణను సత్కరించారు. పింఛనుదారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.


