డిప్యూటీ సీఎం వస్తారని..
న్యూస్‌రీల్
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గిరిజన దర్బార్‌కు హాజరు నాగోబాకు పోటెత్తిన భక్తులు భారీగా వచ్చిన గిరిజనులు దర్బార్‌లో సమస్యల ఏకరువు అటవీశాఖ పైనే ఫిర్యాదులు
శుక్రవారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2026
డిప్యూటీ సీఎంను కలిసిన ‘కంది’
కై లాస్‌నగర్: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి వి క్రమార్కను కాంగ్రెస్ ఆదిలాబాద్ నియోజకవ ర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి బుధవారం రా త్రి ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ భవనంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. నియోజకవర్గ స్థితిగతులు, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సన్నద్ధత గురించి చర్చించారు.
ఆదిలాబాద్‌టౌన్/ఇంద్రవెల్లి: గిరిజనుల సంస్కృతి గొప్పదని, గిరిజనుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా జాతరలో భాగంగా గురువారం గిరిజన దర్బార్ నిర్వహించగా మంత్రి హాజరయ్యారు. నాగోబా ఆ లయ కమిటీ సభ్యులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం గిరిజన దర్బార్‌లో ప్రసంగించారు. గత ప్రభుత్వం నాగోబా ఆలయాన్ని నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. సమ్మక్క–సారలమ్మ జాతరల అభివృద్ధికి రూ.250 కో ట్లు కేటాయించి శాశ్వ త నిర్మాణాలు చేపట్టిందని పేర్కొన్నారు. నా గోబా ఆలయాభివృద్ధికి రూ.22 కోట్లు త్వ రలో విడుదల చేస్తామని హా మీ ఇచ్చారు. అటవీ పరిధిలోని గిరిజను సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. చట్టాలను గౌరవించాలని, అటవీశాఖ అధికారులు చిన్నపాటి పొరపాటు చేసినా వారి ఉద్యోగాలకు ముప్పు వస్తుందని తెలిపారు. ఏడుగురు నాగోబా ఆలయ పూజారులకు ధూపదీప నైవేద్యం కింద వేతనాలు మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తొమ్మిది మందికి ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా, ఐ టీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఎస్పీ అఖిల్ మ హాజన్, అదనపు ఎస్పీలు కాజల్‌సింగ్, మౌనిక, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆయా శాఖ ల అధికారులు, గిరిజన సంఘాల నా యకులు, నాగోబా ఆలయ కమిటీ చైర్మ న్ మెస్రం ఆనంద్‌రావు, ఆలయ పీఠాధి పతి మెస్రం వెంకట్‌రావు, కేస్లాపూర్ సర్పంచ్ మెస్రం తుకారాం, మెస్రం వంశ పెద్దలు మెస్రం కోసేరావు, హన్మంత్‌రావు, దాదారావు, మెస్రం వంశ ఉద్యోగులు మెస్రం శేఖర్‌బాబు, మెస్రం దేవ్‌రావు, మనోహర్, సోనేరావు తదితరులున్నారు.
దర్బార్‌లో
వినతుల వెల్లువ
గిరిజన దర్బార్‌లో తొమ్మిది తెగల గిరిజనులు ఆయా సమస్యలపై మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ రాజర్షిషాకు వినతిపత్రాలు అందజేశారు. ప్రధానంగా అటవీశా ఖ అధికారులపైనే ఫిర్యాదు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, రోడ్ల నిర్మాణాలకు అనుమతులివ్వడం లేదని తెలిపారు. పాదయాత్రగా వచ్చి న గిరిజనులు దర్బార్ ఎదుట నిరసన తెలుపగా ఖా నాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వారిని సముదాయించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్
తోపాటుపలు ఆదివాసీ సంఘాల నాయకులు మా ట్లాడుతూ.. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొ లగించే అంశంపై సుప్రీం కోర్టుకు నిరా ధారమైన అఫిడవిట్ అందించారని ఆరో పించారు. గిరిజన శాఖ ప్రిన్సిపల్ సెక్రట రీ సభ్యసాచి ఘోష్‌ను ఆ ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గిరి జన యూనివర్సిటీని ఆదిలాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని కోరారు. ప్రత్యే క డీఎస్సీ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీల ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని, జిల్లా కేంద్రంలో ఉంటున్నవారికి సర్వే నంబర్ 72లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
నాగోబా జాతరకు భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఎటుచూసినా జాతర ప్రాంగణం జనసందోహంతో కిక్కిరిసిపోయింది. గిరిజన దర్బార్ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గుస్సాడీ నృత్యాలు, చిన్నారుల ఆటాపాటలు అలరించాయి. భద్రాచలం నుంచి వచ్చిన గిరి జనులు కొమ్ము నృత్యం చేశారు. మహారాష్ట్ర, మ ధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివా సీ గిరిజనులు ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టు కున్నాయి. వైద్యశిబిరం నిర్వహించి అవసరమైనవారికి చికిత్స, మందులు అందించారు.
నూతన నియామకం
బోథ్: తెలంగాణ మన స మాఖ్య పార్టీ జిల్లా ఇన్‌చా ర్జిగా నల్ల చంద్రకాంత్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అశోక్ నియామక ఉ త్తర్వులు జారీ చేశారు. తన పై నమ్మకంతో పదవి కట్టబెట్టిన జాతీయ అ ధ్యక్షుడు అశోక్‌కు చంద్రకాంత్‌రెడ్డి ఈ సందర్భంగా కతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రతీ గ్రామానికి చేరవేసి పటిష్టానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
నేడు నాగోబాకు కవిత పూజలు
కై లాస్‌నగర్: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో నిర్వహిస్తున్న నాగోబా జాతరకు మాజీ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం హాజరుకానున్నారు. ఆలయ కమి టీ ఆహ్వానం మేరకు ఆమె రానున్నట్లు జాగృతి నాయకులు రంగినేని శ్రీనివాస్, అసపు ప్రమోద్ తెలిపారు. నాగోబాను దర్శించుకుని ఆలయంలో పూజలు చేస్తారని పేర్కొన్నారు.
గిరిజన దర్బార్‌కు ఉప ముఖ్య మంత్రి మల్లుభట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు హాజరవుతారని ప్రచారం జరిగింది. బుధవారం రాత్రి కేస్లాపూర్‌కు చేరుకున్న ఉపముఖ్యమంత్రి నాగోబాను దర్శించుకున్నారు. గురువారం జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. దర్బార్‌కు హాజరవుతారని అందరూ భావించినా ఆయన ఆసిఫాబాద్ పర్యటనకు వెళ్లిపోయారు. మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి కూడా వస్తారని అనుకున్నా ఒక్క అటవీ, దేవాదాయశాఖ
మంత్రి కొండా సురేఖ మాత్రమే
హాజరయ్యారు.
డిప్యూటీ సీఎం వస్తారని..
డిప్యూటీ సీఎం వస్తారని..
డిప్యూటీ సీఎం వస్తారని..
డిప్యూటీ సీఎం వస్తారని..
డిప్యూటీ సీఎం వస్తారని..


