భోగిభాగ్యాలు నింపాలని..
రంపచోడవరం సాయిబాబా ఆలయం వద్ద భోగి మంట
ద్వారకా తిరుమల దత్తత నారాయణ గిరిపై గోదా కల్యాణం నిర్వహిస్తున్న పండితులు
బాబరే ఇష్టారాజ్యం!
రంపచోడవరం: అజ్ఞాన చీకట్లను పారద్రోలుతూ.. వెలుగులు నింపే భోగి పండగను బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఊరూవాడా మంటలు వేసి సందడి చేశారు. ద్వారకా తిరుమల దత్తత దేవాలయం నారాయణగిరిపై ఈఓ సుధాకర్ ఆదేశాలతో గోదా ఆండాళ్ రంగనాథుల కల్యాణ మహోత్సవాన్ని అర్చకుడు అద్దంకి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి వేడుకను తిలకించారు. సారె, సూత్రాలు, పట్టు వస్త్రా లను తనికెళ్ల శ్రీనివాస్, విజయలక్ష్మి దంపతులు, గోపాలకృష్ణ భాను చేతుల మీదుగా అందజేశారు. ఐ.పోలవరంలోని తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో భోగి పండగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భోగి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సంప్రదాయబద్ధంగా భోగి మంటలను వేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు పార్ధుస్వామి, మణికంఠ స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
భోగిభాగ్యాలు నింపాలని..


