20లోపు ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన నిర్వహించిన నేషనల్ మీనన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 7వ తరగతి మార్కుల సర్టిఫికెట్లను ఈనెల 20వ తేదీ లోపు సిద్ధం చేసుకోవాలి. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు బుధవారం ప్రకటనలో ఈ విషయం తెలిపారు. సర్టిఫికెట్ల ధ్రువీకరణకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో పత్రికా ప్రకటన రూపంలోనూ, అలాగే పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ బీఎస్‌ఈ.ఏపీ.గవ్.ఇన్ లో విడుదల చేయడం జరుగుతుందన్నారు.
సముద్రమంత సైన్యం
గోష్పాదమంతైంది
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): కురు పాండవ సంగ్రామం 18వ రోజు 11 అక్షౌ హిణుల సముద్రమంత కురుసైన్యం గోష్పాదమంత అయ్యిందని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. బుధవారం హిందూ సమాజంలో ఆయన చివరి రోజు యుద్ధ విశేషాలను వివరించారు. సర్వసైన్యాధి అయిన శల్యుని, అతడి సోదరుని ధర్మరాజు వధిస్తాడు. సహదేవుడు శకునిని వధిస్తాడు. వికల మనస్కుడైన దుర్యోధనుడు ఒంటరిగా, కాలి నడకన వెళ్లి జల స్తంభన విద్య ద్వారా నీటి మడుగులోకి ప్రవేశిస్తాడు. ఈ వార్త తెలిసిన పాండవులు మడుగు వద్దకు వెళ్లి దుర్యోధనుని యుద్ధానికి ఆహ్వానిస్తారు. తన వారందరూ మరణించారు కనుక, రాజ్యం మీద తనకు ఆసక్తి లేదని, అది పాండవులకే ఇచ్చి వేస్తానని దుర్యోధనుడు అంటాడు. నీవు దానంగా ఇచ్చిన రాజ్యాన్ని మేము స్వీకరించబోమని ధర్మరాజు చెబుతాడు. భీముడు గదతో తొడలు బదలు కొట్టగా దుర్యోధనుడు రణభూమిలో పడిపోతాడని సామవేదం అన్నారు.
జేఎన్‌టీయూకేకి
ఈఏపీ సెట్ బాధ్యత
కన్వీనర్‌గా మోహనరావు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కోర్సుల ప్రవేశ పరీక్షల్లో అత్యంత కీలకమైన ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ సంబంధిత కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026–27 ఏడాదికి సంబంధించి పరీక్ష నిర్వహణ బాధ్యతను జేఎన్‌టీయూకేకి అప్పగించారు. పదో సారి పరీక్ష నిర్వహణ బాధ్యతను వర్సిటీ నిర్వహి హిస్తోంది. 2015 నుంచి 2019 వరుసగా ఐదుసార్లు నిర్వహించగా కన్వీనర్‌గా ప్రొఫెసర్ సాయిబాబు వ్యవహరించారు. మళ్లీ 2021–22కు సంబంధించి రెండుసార్లు ప్రొఫెసర్ వి.రవీంద్ర, 2024లో ప్రొఫెసర్ వెంకటరెడ్డి పరీక్ష నిర్వహించగా, గత ఏడాది ప్రొఫెసర్ వీవీ సుబ్బారావు, ఈ ఏడాది జేఎన్‌టీయూకే కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.మోహనరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన గతంలో ఈఏపీ సెట్‌కు రెండు సార్లు కో–కన్వీనర్‌గా వ్యవహరించారు.


